rajnath singh: చైనాతో ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్‌ సింగ్ స్పందన

  • సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం
  • మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నాయి
  • అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి‌తో మాట్లాడాను
  • చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పాను
rajnath on china

లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే చర్యలను తాము అడ్డుకుని తీరతామని అన్నారు. చైనాతో ఏర్పడిన సమస్య పరిష్కారానికి ఈ విషయంపై మిలిటరీ, దౌత్య పరమైన చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాను భారత్‌-చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. తాను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ టీ ఎస్పెర్‌తో మాట్లాడానని, ఈ సమస్యను చైనాతో చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పినట్లు తెలిపారు. చైనాతో గతంలోనూ ఇటువంటి సమస్యలు తలెత్తాయని ఆయన గుర్తు చేశారు. పొరుగు దేశాలతో భారత్‌ సత్సంబంధాలు కొనసాగించేందుకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తుందని చెప్పారు.

More Telugu News