Raghava Lawrence: ఆ 21 మందీ కోలుకుంటున్నారు: దర్శకుడు రాఘవ లారెన్స్

Raghava Lawrence told thanks to SP Velumani
  • వారం రోజుల క్రితం కరోనా బారినపడిన చిన్నారులు
  • సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు
  • చిన్నారుల కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించాలన్న లారెన్స్
అనాథ చిన్నారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారినపడిన మాట వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం వాళ్లంతా కోలుకుంటున్నారని అన్నాడు. వారం రోజుల క్రితం ట్రస్టులోని కొందరు చిన్నారుల్లో జ్వరంతోపాటు కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో వారికి వెంటనే పరీక్షలు చేయించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు.

కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు.
Raghava Lawrence
Orphanage Home
Corona Virus

More Telugu News