ప్రభాస్ సరసన నటించనున్న బాలీవుడ్ అగ్రనటి?

30-05-2020 Sat 20:09
  • ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్
  • తదుపరి చిత్రాన్ని నాగ్ అశ్విన్ తో చేయనున్న యంగ్ రెబల్ స్టార్
  • ప్రభాస్ తో దీపికా పదుకునే నటిస్తుందని ప్రచారం
Deepika Padukone to pair with Prabhas in Nag Ashwins film

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ప్రభాస్ తన తరుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నాడు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. తాజాగా దీపికా పదుకునే పేరు తెరపైకి వచ్చింది. దీనికి దీపిక తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన కామెంటే కారణం.

'మహానటి' సినిమాను అందరూ చూడండి అని దీపిక కామెంట్ పెట్టింది. దీనికి కొనసాగింపుగా... తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అంటూ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా పేజ్ లో రాశాడు. దీంతో, ప్రభాస్ తో దీపిక జతకట్టబోతోందనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.