Lockdown 5: లాక్ డౌన్ 5.0లో అన్నీ ఎత్తేశారు.. వీటికి మాత్రం అనుమతి లేదు!

These are not allowed in lockdown 5
  • జూన్ 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం
  • బార్లు, పార్కులు, సినిమా థియేటర్లకు నో పర్మిషన్
  • రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై కొనసాగనున్న నిషేధం
అందరూ ఊహించిందే జరిగింది. లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దాదాపు అన్ని ఆంక్షలను కేంద్రం ఎత్తి వేసింది. కొన్ని అంశాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిర్ణయం తీసుకునే వెసులుబాటును కల్పించింది. రాత్రి పూట కర్ఫ్యూ విషయంలో కూడా సమయాన్ని తగ్గించింది. విద్యా సంస్థలపై మాత్రం జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది.

అయితే లాక్ డౌన్ 5.0లో కూడా కొన్నింటికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతర్జాతీయ విమాన సేవలు, మెట్రో రైలు సేవలకు అనుమతిని నిరాకరించింది. బార్లు, జిమ్ లు, సినిమా హాల్స్, పార్కులను ప్రారంభించరాదని స్పష్టం చేసింది. రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై కూడా నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.
Lockdown 5
Lockdown
Permission
Not Permitted

More Telugu News