Kesineni Nani: ప్రత్యేక హోదా సాధిస్తానని మాటిచ్చావుగా... అదెప్పుడు సాధిస్తావు?: సీఎం జగన్ కు కేశినేని నాని ప్రశ్నాస్త్రం

Kesineni Nani questions CM Jagan on special status issue
  • ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్
  • మరోసారి ప్రమాణం చేసిన వైనం
  • ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించిన కేశినేని నాని
సీఎం జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఆరు కోట్ల మంది ఆంధ్రులకు ఇచ్చిన మాటను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నానని ఆయన ఉద్ఘాటించారు. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యం ప్రదర్శించారు.

మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని మాటిచ్చావు కదా... అదెప్పుడు సాధిస్తావు? అని ప్రశ్నించారు. అంతకుముందు మరో ట్వీట్ లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపైనా స్పందించారు. హైకోర్టులో నిమ్మగడ్డకు ఊరట లభించడంపై వ్యాఖ్యానిస్తూ.... న్యాయమే గెలిచిందని, ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని, న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడిందని తెలిపారు.
Kesineni Nani
Jagan
AP Special Status
One Year Ruling
Andhra Pradesh
YSRCP

More Telugu News