Uttam Kumar Reddy: వందలాది జనం మధ్య కేసీఆర్ కు, మంత్రులకు మాస్కుల్లేవు... చట్టానికి అతీతమా?: ఉత్తమ్ కుమార్ విసుర్లు

Uttam Kumar fires on CM KCR and ministers for not wearing masks
  • కొండపోచమ్మ సాగర్ కు గోదావరి జలాలు
  • కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు
  • నియమనిబంధనలు సామాన్యులకేనా? అంటూ ఉత్తమ్ వ్యాఖ్యలు
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను ఎత్తిపోతలు చేసే కార్యక్రమంలో సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, మంత్రులు, అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్, మంత్రులు వందలాది మంది మధ్య ఉండి కూడా ముఖాలకు మాస్కులు ధరించలేదని, కనీసం భౌతికదూరం పాటించలేదని విమర్శించారు. "స్వయంగా కేసీఆరే కరోనా లాక్ డౌన్ రూల్స్ రూపొందించారు, పెళ్లికి 20 మంది మించకూడదని, అంత్యక్రియల్లో 10 మంది కంటే ఎక్కువమంది పాల్గొనరాదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తాం అన్నారు. నియమనిబంధనలు సామాన్యులకేనా.... కేసీఆర్ ఏమైనా చట్టానికి అతీతుడా?" అంటూ ఉత్తమ్ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.

Uttam Kumar Reddy
KCR
Masks
Rules
Kondapochamma Sagar
Telangana

More Telugu News