రూ. 48 కోట్లతో ఆఫీసు ప్రారంభించిన కంగన.. బాలీవుడ్ షాక్!

30-05-2020 Sat 12:26
  • ఇంటి నుంచి రూ. 1500తో బయటకు వచ్చా
  • ఎన్నో పోరాటాల తర్వాత అగ్రనటిగా ఎదిగాను
  • అత్యంత ధనికురాలిగా నిలవడమే నా లక్ష్యం
I came to Mumbai only for earning money says Kangana Ranaut

బాలీవుడ్ లో కంగన రనౌత్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే బాలీవుడ్ లో మహిళగా తనదైన ముద్రను వేసింది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వకపోయినా అగ్ర నటిగా ఎదిగింది. అంతేకాదు ఇతరులు అసూయపడేలా నిర్మాతగా, దర్శకురాలిగా కూడా మారింది. తాజాగా ముంబైలో రూ. 48 కోట్లు ఖర్చుపెట్టి ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది. ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ, చేతిలో కేవలం రూ. 1500తో ఇంటి నుంచి బయటకు వచ్చానని చెప్పింది. డబ్బు సంపాదించడానికే మా ఊరు నుంచి ముంబై వచ్చానని తెలిపింది. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ డబ్బు సంపాదిస్తే జీర్ణించుకోలేరని చెప్పింది. ఎన్నో పోరాటాల తర్వాత పెద్ద స్టార్ గా ఎదిగానని తెలిపింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి  అత్యంత ధనికురాలిగా నిలవడమే తన లక్ష్యమని చెప్పింది.