హాంకాంగ్‌ పరిణామాలపై చైనాపై ట్రంప్ ఆగ్రహం

30-05-2020 Sat 10:40
  • హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రతా చట్టం
  • చైనా వైఖరిని ఖండించిన ట్రంప్
  • హాంకాంగ్ హోదాకు విఘాతం 
  • అమెరికా వర్సిటీల్లో చేరే చైనా విద్యార్థులను అడ్డుకుంటాం
trump fires on china

హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయటానికి చైనా బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తితో పాటు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు నష్టం జరుగుతుందంటూ ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హాంకాంగ్‌‌కు తమ దేశం క‌ల్పిస్తున్న ప్ర‌త్యేక అధికారాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

హాంకాంగ్‌ను‌ చైనా తన అధీనంలోకి తీసుకుంటున్న వైఖరిని ట్రంప్ ఖండించారు. హాంకాంగ్ హోదాకు విఘాతం ఏర్పడుతోందని, ఇది అక్కడి ప్ర‌జ‌ల‌కు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరుకి ప్రతిగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరే చైనా విద్యార్థులను అడ్డుకోనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్పటికే హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయటానికి ప్రయత్నిస్తోన్న చైనా తీరుపై అమెరికా, బ్రిట‌న్ ఐక్యరాజ్యసమితి భ‌ద్ర‌తా మండ‌లిలో నిర‌స‌న వ్య‌క్తం చేశాయి.