Nara Lokesh: జగన్‌ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే స్కాములు, మంత్రుల బూతులు, దౌర్జన్యాలు!: లోకేశ్

lokesh fires on ycp leaders
  • జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వమంటూ వచ్చిన బిరుదులు
  • భూకబ్జాలు, స్కాములు  
  • అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయి
  • బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు
వైసీపీ ప్రభుత్వ ఏడది పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'వైఎస్ జగన్ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం, తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, భజనలు, దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి' అని విమర్శించారు.
 
'ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు.160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు' అని చెప్పారు.

'బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి' అని తెలిపారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News