మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ ఆత్మహత్య

30-05-2020 Sat 10:35
  • పరవాడ మండలంలోని కలపాకలో బలవన్మరణం
  • ఆత్మహత్యకు ముందు బంధువులకు ఆడియో మెసేజ్
  • వలంటీరు వేధింపులే కారణమని ఆరోపణ
Ex Minister Bandaru Satyanarayana murthy car driver Suicide

విశాఖపట్టణం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కారు డ్రైవర్ నాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని పరవాడ మండలం కలపాకలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తానెందుకు చనిపోతున్నదీ వివరిస్తూ బంధువులకు ఆడియో మెసేజ్ పంపాడు. వలంటీరు వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడని ఆయన బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.