'ప్రపంచంపై ఇక ఏలియన్స్‌ దాడి చేస్తాయేమో' అంటూ మిడతల వీడియో పోస్ట్ చేసిన వర్మ

30-05-2020 Sat 10:13
  • ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది
  • మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి
  • మొదట వైరస్‌లు ప్రపంచంపై దాడి
  • ప్రస్తుతం మిడతలు అటాక్
 WHAT NEXT after VIRUSES and LOCUSTS

వైరస్‌లు ప్రపంచంపై దాడి చేసిన అనంతరం ప్రస్తుతం మిడతలు అటాక్‌ చేస్తున్నాయని, తదుపరి ఏలియన్స్‌ దాడులు చేస్తాయా? అని సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ప్రశ్నించారు. కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచంలో ఆందోళనకరన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా మిడతలు కూడా పంట పొలాలను నాశనం చేస్తోన్న విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రామ్‌ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. 'ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి' అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా, భారత్‌లోకి పర్యటించిన మిడతలను తరిమికొట్టడానికి అధికారులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.