న్యాయమే గెలిచింది.. న్యాయ వ్యవస్థపై నమ్మకం నిలబడింది: హైకోర్టు తీర్పుపై కేశినేని నాని

29-05-2020 Fri 12:16
  • ఎస్ఈసీగా రమేశ్  కుమార్ ను కొనసాగించాలన్న హైకోర్టు
  • కోర్టు తీర్పుపై కేశినేని నాని హర్షం
  • రాజ్యాంగం గెలిచిందని వ్యాఖ్య
Finally justice won says Kesineni Nani

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ రమేశ్ కుమార్ ను  తొలగించడాన్ని హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేక చర్యగా స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ ను కొట్టివేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. అన్ని జీవోలను కొట్టివేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు.. రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీ గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు.

'న్యాయం గెలిచింది. చట్టం గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. రాజ్యాంగం గెలిచింది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది' అని కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ ను ముఖ్యమంత్రి జగన్, వైసీపీలకు జత చేశారు.