అందుకే సరిహద్దుల్లో చైనా దాడి చేస్తోంది: శివసేన

29-05-2020 Fri 11:34
  • కొవిడ్‌-19 వ్యాపిస్తోన్న నేపథ్యంలో చైనా సైన్యం సరిహద్దులో దాడి 
  • సంక్షోభాలను అవకాశంగా తీసుకుని ప్రతిసారి దాడికి పాల్పడుతుంది
  • గతంలో జిన్‌పింగ్‌ గుజరాత్‌ వచ్చినపుడు మోదీ మర్యాదలు చేశారు
  • మధ్యవర్తిత్వం చేస్తానని  ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జోక్‌గా ఉన్నాయి
shiv sena on trump

చైనా, భారత్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న విషయంపై శివసేన పార్టీ తమ అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. ఇందులో ప్రధాని మోదీ తీరుపై విమర్శలు గుప్పించింది. కొవిడ్‌-19 వ్యాపిస్తోన్న నేపథ్యంలో చైనా సైన్యం భారత సరిహద్దులో దాడి చేయడాన్ని ప్రారంభించిందని పేర్కొంది.

సంక్షోభాలను అవకాశంగా తీసుకుని చైనా ప్రతిసారి దాడికి పాల్పడుతుందని శివసేన తెలిపింది. గతంలో జిన్‌పింగ్‌ గుజరాత్‌ వచ్చినపుడు ఆయనకు ప్రధాని మోదీ చాలా బాగా అతిథి మర్యాదలు చేశారని చెప్పింది. ఆయనకు మోదీ   గుజరాతీ రుచులుతో విందు ఇచ్చారని పేర్కొంది.

వారిద్దరూ అప్పట్లో ఊయల ఊగారని గుర్తు చేసింది. అయినప్పటికీ లాభం లేకుండా పోయిందని తెలిపారు. తమ భూభాగంలోకి చొరబడుతున్నారంటూ ఇరు దేశాలు పరస్పరం ఉద్రిక్తతలను పెంచుకుంటున్నాయని చెప్పారు. తాను మధ్యవర్తిత్వం చేసి, సమస్యను పరిష్కరిస్తానంటూ డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను శివసేన జోక్‌గా అభివర్ణించింది.