vaccine: వ్యాక్సిన్‌ వచ్చినా కరోనా పోదు: అమెరికా వైద్య నిపుణులు

Covid may never go away even with a vaccine
  • కొవిడ్‌-19 వ్యాప్తి కొన్నేళ్ల పాటు ఉంటుంది
  • హెచ్‌ఐవీ, తట్టు, అమ్మవారు వంటి వ్యాధుల్లా ఉండిపోయే ఛాన్స్‌
  • ఇప్పటికే కరోనా జాతికి చెందిన నాలుగు వైరస్‌ల వల్ల జలుబు
  • కరోనాతోనే సురక్షితంగా ఎలా సహజీవనం చేయగలమనేదే ముఖ్యం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాన్ని అరికట్టే క్రమంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ కొవిడ్‌-19 వ్యాప్తి కొన్నేళ్ల పాటు ఉంటుందని అమెరికాకు చెందిన వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతేగాక, హెచ్‌ఐవీ, తట్టు, అమ్మవారు వంటి వ్యాధుల్లా కరోనా కూడా మానవులను పీడిస్తూనే ఉండే అవకాశాలూ లేకపోలేదని చెప్పారు. ఇప్పటికే కరోనా జాతికి చెందిన నాలుగు వైరస్‌ల వల్ల మనుషులకి సాధారణ జలుబు వంటివి వస్తున్నాయని, కొవిడ్‌-19 ఈ జాబితాలో ఐదోదిగా చేరే అవకాశం ఉందని చెప్పారు.  

కరోనాతో సురక్షితంగా ఎలా సహజీవనం చేయగలమనేదే ముఖ్యమని షికాగో విశ్వవిద్యాలయ వైద్య నిపుణుడు సారా కోబె తెలిపారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని విధాలుగా స్థిరంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని చెప్పారు.  

కరోనాపై పోరాటం చేయడానికి ఏదో ఒక విధానం సరిపోదని, అన్ని విధాలా సమగ్రమైన యుద్ధ వ్యూహాలతో, పూర్తి శ్రద్ధతో కరోనాపై పోరాట నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమెరికాలో కరోనా ఎంత కాలం ఉంటుందన్న దానిపై ఆ దేశం తదుపరి దశలో తీసుకునే కీలక చర్యలపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెప్పారు.  
vaccine
COVID-19
Corona Virus

More Telugu News