China: భారత్‌లో ఆందోళన కలిగిస్తున్న కరోనా మరణాలు.. చైనాను దాటేసిన వైనం!

  • కేసుల విషయంలో తొమ్మిదో స్థానంలో భారత్
  • నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 7,466 కేసుల నమోదు
  • 4,706 మరణాలతో చైనాను దాటేసిన ఇండియా
India Crosses China in Corona death

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 7,466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. ఫలితంగా కరోనా మరణాల్లో చైనాను భారత్ అధిగమించింది. చైనాలో ఇప్పటి వరకు 4,634 మంది కరోనాతో మరణించారు. భారత్‌లో ఏకంగా 4,706 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఇక, కేసుల విషయంలోనూ భారత్ 9వ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 1.82 లక్షల కేసులతో జర్మనీ 8వ స్థానంలో వుండగా, 1.60 లక్షల కేసులతో టర్కీ పదో స్థానంలో ఉంది. కేసులు, మరణాల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అనూహ్యంగా బ్రెజిల్ రెండో స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత వరుసగా రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌లు టాప్-10లో ఉన్నాయి.

More Telugu News