సౌదీ నుంచి తెలంగాణకు వచ్చిన 49 మందికి కరోనా పాజిటివ్!

28-05-2020 Thu 21:35
  • నేడు స్థానికంగా 66 మందికి కరోనా నిర్ధారణ
  • బయటి నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా పాజిటివ్
  • నేడు నలుగురు మృత్యువాత
Saudi returns tested corona positive in Telangana

తెలంగాణలో కొత్తగా 117 కరోనా కేసులు వెలుగుచూశాయి. స్థానికంగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా సోకినట్టు తేలింది. వారిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇద్దరు వలస కార్మికులు కూడా కరోనా బారినపడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1908కి పెరగ్గా, 1345 మంది డిశ్చార్జి అయ్యారు. 844 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక నేడు మరో నాలుగు మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 67కి పెరిగింది.