Poonam Kaur: ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒంటరిగా నివాళులర్పించిన పూనమ్ కౌర్

Poonam Kaur pays tribute at NTR ghat
  • ఇవాళ ఎన్టీఆర్ జయంతి
  • ఎన్టీఆర్ ను తెలుగు ప్రజల దేవుడిగా అభివర్ణించిన పూనమ్
  • తనను దీవించాలంటూ ట్వీట్
నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు , మరికొందరు ప్రముఖులు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి అంజలి ఘటించారు. దీనిపై పూనమ్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ను తెలుగు ప్రజల దేవుడిగా అభివర్ణించారు.

"స్వర్గంలో ఉన్న మీరు నన్ను ఆశీర్వదించండి. దుష్ట శక్తులతో పోరాడే ధైర్యాన్నిచ్చేలా దీవించండి. మానవత్వం బొత్తిగా కరవైన ఈ రోజుల్లో మీవంటి నేతలు, మీవంటి నటుల అవసరం ఎంతో ఉంది" అంటూ భావోద్వేగాలు ప్రదర్శించారు.
Poonam Kaur
NTR
Birth Anniversary
NTR Ghat
Hyderabad

More Telugu News