Leopard: నల్గొండ జిల్లాలో కలకలం రేపిన చిరుత.. జూకి తరలిస్తుండగా మృతి

  • రైతు పొలంలో కంచెకు చిక్కుకుపోయిన చిరుత
  • ఎంతో శ్రమించి కాపాడిన అటవీశాఖ అధికారులు
  • అంతర్గత రక్తస్రావంతో చిరుత మృత్యువాత!
Leopard dies of internal wounds while shifting to Zoo

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలంలో ఓ రైతు పొలం చుట్టూ వేసిన కంచెలో చిక్కుకుపోయి అందరినీ హడలెత్తించిన చిరుత మృతి చెందింది. ఈ చిరుతను ఎంతో ప్రయాసలకోర్చి అటవీశాఖ అధికారులు కాపాడగా, వారి శ్రమ వృథా అయింది. ఈ చిరుతను హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కు తరలిస్తుండగా తుదిశ్వాస విడిచింది. ఆ చిరుతపులి వయసు 7 సంవత్సరాలు. అంతర్గత గాయాలతో రక్తస్రావానికి తోడు భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరై ఆ చిరుత మరణించినట్టు అధికారులు భావిస్తున్నారు.

More Telugu News