రష్యా టీవీలో 'బాహుబలి' సినిమా ప్రసారం... వీడియో ఇదిగో!

28-05-2020 Thu 17:18
  • ఖండాంతరాలు దాటిన బాహుబలి ప్రాభవం
  • రష్యా డైలాగులతో బాహుబలి ప్రసారం
  • తమ దేశంలో భారత చిత్రాలు పాప్యులర్ అవుతున్నాయన్న రష్యా ఎంబసీ
Russian tv channel telecasts Bahubali with Russian dialogues

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన వారిలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఆయన తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు అనేక దేశాల్లో ప్రజాదరణ పొందాయి. తాజాగా రష్యా టీవీలోనూ బాహుబలి చిత్రం ప్రసారమైంది. అది కూడా రష్యా భాషలో డైలాగులతో. ఈ విషయాన్ని భారత్ లోని రష్యా దౌత్య కార్యాలయం స్వయంగా వెల్లడించింది. రష్యాలో భారత చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయని పేర్కొంది. "రష్యా టీవీలో ఇప్పుడు ఏం ప్రసారమవుతుందో చూడండి! రష్యా డైలాగులతో బాహుబలి!" అంటూ రష్యా ఎంబసీ ట్వీట్ చేసింది.