కరోనా పోవాలని నరబలి ఇచ్చిన అర్చకుడు

28-05-2020 Thu 14:05
  • ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర ఘటన
  • బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి
  • అర్చకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Priest sacrificed man to stop Corona

ఒడిశాలో అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. కరోనా పోవాలంటూ  ఏకంగా నరబలి ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.