Pawan Kalyan: బోరుబావిలో చిన్నారి మృతి ఘటన మనస్తాపం కలిగించింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences to Sai Vardhan who died in a bore well
  • మెదక్ జిల్లాలో బోరుబావి దుర్ఘటన
  • విగతజీవుడైన సాయివర్ధన్ అనే చిన్నారి
  • సంతాపం తెలియజేసిన పవన్
చిన్నారుల ప్రాణాలను కబళించేందుకు మృత్యువులా నోర్లు తెరుచుకుని ఉండే బోరు బావులు మరో ప్రాణాన్ని హరించాయి. మెదక్ జిల్లాలో సాయివర్ధన్ అనే మూడేళ్ల పసివాడు బోరు బావిలో పడగా, అధికారుల శ్రమ నిష్ఫలమే అయింది. అందరినీ విషాదంలో ముంచెత్తుతూ సాయివర్ధన్ విగత జీవుడయ్యాడు.

దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బోరు బావి దుర్ఘటనలో మూడేళ్ల పసివాడు సాయివర్ధన్ మృతి చెందడం చాలా మనస్తాపం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పసిబిడ్డ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. సాయివర్ధన్ తల్లిదండ్రులకు, మిగతా కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
Pawan Kalyan
Sai Vardhan
Bore Well
Death
Medak District
Telangana

More Telugu News