ఐపీఎల్ ఈ ఏడాది కచ్చితంగా జరుగుతుంది: అనిల్ కుంబ్లే

28-05-2020 Thu 13:52
  • కరోనా దెబ్బకు నిలిచిపోయిన క్రికెట్ ఈవెంట్లు
  • ఇప్పటికే వాయిదా పడిన ఐపీఎల్
  • ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ జరుగుతుందన్న కుంబ్లే
IPL definitely happen this year says Anil Kumble

కరోనా కారణంగా ప్రపంచ క్రికెట్ స్తంభించిపోయింది. ఏ స్థాయి క్రికెట్ కూడా ఎక్కడా జరగడం లేదు. ఐసీసీ మేజర్ ఈవెంట్స్ తో పాటు, ఐపీఎల్ పై కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వాయిదా పడింది. ఈ ఏడాది జరుగుతుందా? లేదా? అనే అయోమయం సర్వత్ర నెలకొంది. ఇక ఈ ఏడాది అక్టోబర్ లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని, ఆ నమ్మకం తనకుందని చెప్పారు. అయితే, స్టేడియంలలో మాత్రం ప్రేక్షకులు ఉండరని తెలిపారు.