రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'గా రవితేజ!

28-05-2020 Thu 13:06
  • ఇటీవలి కాలంలో హిట్లకు దూరమైన రవితేజ
  • రమేశ్ వర్మ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు
  • ద్విపాత్రాభినయం చేయనున్న రవితేజ
Ravitejas new film title is Khiladi

మనకున్న టాలెంటెడ్ నటుల్లో రవితేజ ఒకరు. ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేసేస్తాడు.. అందులోనే తనదైన శైలిని చక్కగా జొప్పిస్తాడు. అయితే, ఇటీవలి కాలంలో విజయాలకు కాస్త దూరంగా వున్నాడు. సరైన సబ్జెక్టులు పడక హిట్లు కొట్టలేకపోతున్నాడు.

ఈ క్రమంలో తాజాగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రవితేజ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ, అదంతా ఒట్టిదేనని యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయనుండడం మరో విశేషంగా చెబుతున్నారు.

ఇదిలావుంచితే, ఈ చిత్రానికి తాజాగా 'ఖిలాడి' అనే టైటిల్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.