Chandrababu: మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు నాయుడు

chandrababu about tdp

  • టీడీపీని ఎవరూ కదిలించలేరు
  • పార్టీ ఎవరికీ భయపడదు
  • వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరు
  • ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

గతంలో టీడీపీపై బురదజల్లిన వారు అదే బురదలో కూరుకుపోయారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీని ఎవరూ కదిలించలేరని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోన్న మహానాడులో రెండో రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ పార్టీ ఎవరికీ భయపడదని, సవాళ్లు ఎదుర్కోవడం తమకు కొత్త కాదని తెలిపారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారని ఆయన చెప్పారు. వారే తమ పార్టీకి శక్తి అని, వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరని ఆయన తెలిపారు. హత్యా రాజకీయాలు చేయడం తమకు అలవాటు లేదని చెప్పారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటిలేరని, ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదనానికి నిలువెత్తు రూపమని, ఆయన‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ నేతలు నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News