ఇళ్లలో పనులు చేసిన హీరోలు, దర్శకులపై వర్మ ట్వీట్

28-05-2020 Thu 13:01
  • లాక్ డౌన్ సమయంలో 'కరోనా' సినిమా తీసేసిన వర్మ
  • మియా మాల్కోవాతో 'క్లైమాక్స్'ను తెరకెక్కించిన వైనం
  • లాక్ డౌన్ సమయంలో మీరు ఏ పనీ చేయలేదన్న నెటిజెన్
RGV comments on heroes and directors

లాక్ డౌన్ సమయంలో అందరూ ఇళ్లకు పరిమితమైతే... డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇదే సమయంలో ఏకంగా 'కరోనా' పేరుతో ఒక సినిమానే తెరకెక్కించి 'ఔరా' అనిపించారు. మరోవైపు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' ను తెరకెక్కించారు. 'కరోనా' ట్రైలర్ కూడా విడుదలైంది. మరోవైపు ఈ ట్రైలర్ పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ ప్రశంసలు కూడా కురిపించారు.

ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్ వర్మను ఉద్దేశించి... 'మీరు ఇంట్లో బట్టలు ఉతకరు, ఇల్లు తుడవరు, గిన్నెలు కడగరు, లాక్ డౌన్ లో ఇంట్లో ఒక పని కూడా చేయలేదు. మీ కోసం మేము ట్వీట్లు చేయము' అని అన్నారు. దీనికి సమాధానంగా వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. లాక్ డౌన్ సమయంలో హీరోలు, దర్శకులు అలాంటి పనులు చేస్తే... తాను ఓ సినిమానే తీసేశాను అని చెప్పారు.