Corona Virus: ఏపీలో కొత్తగా మరో 54 కరోనా కేసులు

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 9,858 శాంపిళ్లను పరీక్షించగా మరో  54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,841అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 824 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,958 మంది డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో కొవిడ్‌-19తో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News