మా వాళ్లు కేసీఆర్ ను సంప్రదించారా? నాకు తెలియదే!: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

28-05-2020 Thu 11:15
  • పత్రికల్లో చూసే విషయం తెలుసుకున్నాను
  • వీలైనంత త్వరగా షూటింగ్స్ మొదలు పెట్టాలి
  • ఈ ఉదయం మీడియాతో బాలయ్య
Balakrishna Comments on tollywood Leaders Meeting with TS Govt

లాక్ డౌన్ నిబంధనలతో సినీ పరిశ్రమ కుదేలు కాగా, షూటింగ్స్ తిరిగి ప్రారంభం, సినిమా హాల్స్ ను రీ ఓపెన్ చేసే విషయమై ఇటీవల పలువురు సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన అనంతరం, మీడియాతో మాట్లాడిన ఆయన, సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని ఆయన అనడం గమనార్హం. పత్రికల్లో చూసి తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానని, సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ తిరిగి మొదలైతే, కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకు కొంతైనా మేలు కలుగుతుందన్నారు. భవిష్యత్తులో తక్కువ మంది సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ సినిమాలు తీయాల్సి వుంటుందని తెలిపారు.