Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు

Samantha is not pretty Pooja Hegde in trouble after controversial post
  • ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దు
  • ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని వ్యాఖ్య
  • ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు మరో ట్వీట్
హీరోయిన్ పూజ హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎవరో సమంత గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పూజ తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారని తన డిజిటల్‌ టీమ్‌ తనకు తెలిపిందని ఆమె ట్విట్టర్‌ ఖాతాలో అభిమానులకు చెప్పింది. ఆ అకౌంట్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని, అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని సూచించింది.

కాగా, ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఆమె డిజిటల్ టీమ్‌ సరి చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజ మరో ట్వీట్ చేసింది. తన డిజిటల్ టీమ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు తన అకౌంట్‌ తన చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు చెప్పింది. ఇన్‌స్టాలో హ్యాక్ అయిన సమయంలో హ్యాకర్లు చేసిన పోస్ట్‌లను తొలగించినట్లు తెలిపింది.
Pooja Hegde
Samantha
Tollywood
Twitter
Instagram

More Telugu News