ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ భావోద్వేగభరిత వ్యాఖ్యలు

28-05-2020 Thu 10:48
  • మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది
  • మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది
  • పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా
  • సదా మీ ప్రేమకు బానిసను
jr ntr on sr ntr

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. 'మీరు లేని లోటు తీరనిది' అని పేర్కొన్నాడు.

'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ తారక్ సీనియర్ ఎన్టీఆర్ ఫొటోను పోస్ట్ చేశాడు.

కాగా, ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో అప్పట్లో గడిపిన మధురానుభూతులను గుర్తు చేసుకుంటున్నారు.