ఆ మహానుభావుడితో కలిసి నటించాను: చిరంజీవి

28-05-2020 Thu 09:14
  • ఎన్టీఆర్ ను స్మరించుకున్న చిరంజీవి
  • రామారావు గారి కీర్తి అజరామరం
  • తన గుండెల్లో చెదరని జ్ఞాపకమన్న మెగాస్టార్
Chiiranjeevi pays tributes to NTR

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను స్మరించుకున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల  గుండెల్లో  ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ.." అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి 'తిరుగులేని మనిషి' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో 'యవ్వనం... ఒక నందనం' అంటూ సాగా పాటలో కలిసి ఆడారు కూడా.