న్యూ లుక్‌లో నారా లోకేశ్.. 20 కిలోలు తగ్గి స్లిమ్‌గా మారిన టీడీపీ నేత!

28-05-2020 Thu 09:01
  • ఆరు నెలల్లో 20 కిలోలు తగ్గిన లోకేశ్
  • రోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం, డైట్ ప్లాన్
  • యువనేతను చూసి ఆశ్చర్యపోయిన నేతలు
TDP Leader Nara Lokesh looks Slim

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నయా లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండు నెలలపాటు హైదరాబాద్‌లో ఉన్న లోకేశ్ చాలా స్లిమ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహానాడులో పాల్గొనేందుకు వచ్చిన లోకేశ్‌ను చూసిన నేతలు సన్నగా మారిపోయిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆరా తీశారు.

గత ఆరు నెలల్లో తాను 20 కేజీల బరువు తగ్గినట్టు లోకేశ్ చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉన్న ఈ రెండు నెలల్లో ఏడు కిలోలు తగ్గినట్టు చెప్పారు. ‘నైక్ ట్రైనింగ్ క్లబ్’ మొబైల్ యాప్‌లో సూచించిన విధంగా రోజుకు 45 నిమిషాలపాటు వ్యాయామం చేయడంతోపాటు చెన్నైకి చెందిన ఓ డైటీషియన్ సూచనలు పాటించి బరువు తగ్గినట్టు చెప్పారు.

 మరి మహానాడుకు పసుపు చొక్కా ఎందుకు వేసుకురాలేదన్న నేతల ప్రశ్నకు లోకేశ్ బదులిస్తూ.. బరువు తగ్గిన కారణంగా ఉన్న పసుపు చొక్కాలన్నీ లూజైపోయాయని, లాక్‌డౌన్ కారణంగా కొత్త చొక్కా కుట్టేవాళ్లు లేకపోవడంతో పాత చొక్కానే వేసుకొచ్చినట్టు లోకేశ్ తెలిపారు.