Telangana: తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు నో కర్ఫ్యూ.. ఇమ్లిబన్ వరకు బస్సులకు అనుమతి

  • ఇక రాత్రివేళ కూడా బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నడుస్తాయి
  • కొత్త నిర్ణయం నేటి నుంచే అమల్లోకి
  • సిటీ, అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రం అనుమతి నిల్
TSRTC Buses now run from MGBS

ప్రగతి భవన్‌లో నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు నగర శివార్లకే పరిమితమవుతున్న ఆర్టీసీ బస్సులను ఇక నుంచి ఇమ్లిబన్ వరకు అనుమతించాలని నిర్ణయించారు. అలాగే, కర్ఫ్యూ అమల్లో ఉండే సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కూడా బస్సులను అనుమతించనున్నారు.

ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండే రాత్రి సమయంలో బస్సు దిగే వారు పోలీసుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బస్సు టికెట్ చూపిస్తే సరిపోతుంది. అలాగే, కర్ఫ్యూ సమయంలో తిరిగేందుకు ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త నిర్ణయాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

రాష్ట్రంలో ముఖ్యంగా, నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో మరో రెండు వారాలపాటు వేచి చూడాలని నిర్ణయించారు. అలాగే, అంతర్రాష్ట్ర సర్వీసులకూ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

More Telugu News