America: అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన జపాన్.. రూ. 70 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన

  • కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన జపాన్
  • మొత్తంగా రూ. 150 లక్షల కోట్ల కేటాయింపు
  • కోవిడ్‌పై పోరులో అత్యధికంగా ఖర్చు చేస్తున్న అమెరికా తర్వాతి స్థానంలో జపాన్
 Japan approves second stimulus package

కరోనా కారణంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జపాన్ ప్రభుత్వం రూ. 70 లక్షల కోట్లతో(1.1 ట్రిలియన్ డాలర్లు) భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో కొంత మొత్తాన్ని నేరుగా ఖర్చు చేయనున్నట్టు జపాన్ ఆర్థిక శాఖ తెలిపింది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన జపాన్.. మహమ్మారి మరోమారు విజృంభిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షింజో అబే అధికారులకు సూచించారు.

గత నెలలో లక్ష ట్రిలియన్ డాలర్లను ప్రటించిన జపాన్ తాజాగా, మరో 1.1 ట్రిలియన్ డాలర్లు ప్రకటించింది. దీంతో ఉద్దీపన ప్యాకేజీ మొత్తం రూ. 150 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా కరోనా వైరస్‌పై పోరుకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా సరసన జపాన్ చేరింది. అమెరికా కూడా దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. కాగా, కరోనాను జపాన్ అద్భుతంగా కట్టడి చేసింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 17 వేల కేసులే నమోదు కాగా, 825 మంది మాత్రమే చనిపోయారు.

More Telugu News