Nepal: నేపాల్ కొత్త మ్యాప్ కు లభించని పార్లమెంటు ఆమోదం... ఘోరంగా విఫలమైన నేపాల్ ప్రధాని!

  • భారత్ భూభాగాలను కలుపుతూ నేపాల్ కొత్త మ్యాప్
  • ఈరోజు పార్లమెంటులో జరిగిన చర్చ
  • మద్దతు ప్రకటించని పలు పార్టీలు
Nepal PM failed to get support for new map

భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లిపియాధురా ప్రాతాంలను తమ భూభాగాలుగా చూపిస్తూ నేపాల్ విడుదల చేసిన మ్యాప్ పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త మ్యాప్ కు బ్రేక్ పడింది. మ్యాప్ కు సంబంధించి పార్లమెంటు ఆమోదముద్ర వేయించడంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఘోరంగా విఫలమయ్యారు.

నేపాల్ కొత్తగా రూపొందించన మ్యాప్ కు నేపాల్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే దీనికి రాజ్యాంగ సవరణ తప్పని సరిగా కావాలి. దీంతో రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంటులో ఈరోజు చర్చ జరిగింది. కానీ, మెజారిటీ సభ్యుల మద్దతును పొందడంలో కేపీ శర్మ ఓలీ విఫలమయ్యారు. వివిధ పార్టీల ఏకాభిప్రాయ సాధనలో ఆయన సఫలీకృతం కాలేకపోయారు. దీంతో కొత్త మ్యాప్ కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటికైతే వాయిదా పడినట్టైంది.

More Telugu News