మహేశ్ చిత్రానికి కొత్త తరహా టైటిల్!

27-05-2020 Wed 15:41
  • పరశురాం దర్శకత్వంలో మహేశ్ సినిమా
  • ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం
  • 'సర్కార్ వారి పాట' టైటిల్ ఖరారు?  
Title finalized for Mahesh film

లాక్ డౌన్ కారణంగా మహేశ్ బాబు కొత్త సినిమాకి కూడా అంతరాయం ఏర్పడింది. 'సరిలేరు నీకెవ్వరూ' తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. అయితే, లాక్ డౌన్ తో షూటింగులు ఆగడంతో ఇది ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 31న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మహేశ్  తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం కావడంతో ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి టైటిల్ని కూడా నిర్ణయించారట. 'సర్కార్ వారి పాట' అనే కొత్త తరహా టైటిల్ని దీనికి ఫైనల్ చేశారని అంటున్నారు. చిత్రం ప్రారంభం రోజున దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.