Madhavi Latha: శ్రీరెడ్డి బాటలో మాధవీలత.. రాకేశ్ మాస్టర్ కు లీగల్ నోటీసులు!

Actress Madhavi Latha sends legal notice to Rakesh Master
  • మాధవీలతపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన రాకేశ్ మాస్టర్
  • క్షమాపణ చెప్పాలంటూ మాధవీలత నోటీసులు
  • లేని పక్షంలో కోర్టు మెట్లు ఎక్కిస్తానని హెచ్చరిక
సినీ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ పై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత లీగల్ నోటీసును పంపారు. తన ఇంటర్వ్యూలలో తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించాయని నోటీసులో ఆమె పేర్కొన్నారు. తనపై చేసిన కామెంట్స్ ను తక్షణమే వెనక్కి తీసుకుని, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లీగల్ గా ముందుకెళ్తానని... కోర్టు మెట్లు ఎక్కించేదాకా ఊరుకోనని హెచ్చరించారు.

ఈ నెల 6న రాకేశ్ మాస్టర్ యూట్యూబ్ చానళ్లలో వీడియోలను అప్ లోడ్ చేశారని.. అందులో మాధవీలతపై అసత్యపూరిత ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ప్రముఖ హీరోలతో లింకులు పెడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేశారని తెలిపారు.  

ఇటీవలి కాలంలో రాకేశ్ మాస్టర్ చర్చనీయాశంగా మారారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురిని ఆయన టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటి శ్రీరెడ్డి కూడా ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.
Madhavi Latha
Rakesh Master
Tollywood
Legal Notice
Chiranjeevi
Sri Reddy

More Telugu News