'మాస్క్ ఇండియా' ప్రచారానికి మహేశ్ బాబు మద్దతు!

27-05-2020 Wed 13:54
  • మాస్క్ ఇండియా హ్యాష్ ట్యాగ్‌లో పోస్ట్
  • అందరూ మాస్కులు ధరించాలన్న మహేశ్
  • ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ సేకరించిన ఫొటోలు పోస్ట్
mahesh tweet

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని అవగాహన కల్పిస్తోన్న సినీనటుడు మహేశ్ బాబు మరోసారి ఇదే విషయంపై ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ ఓ క్యాంపెయిన్ ప్రారంభించి, నోటికి చేయి అడ్డుపెట్టుకుని ఉన్న సినీ ప్రముఖుల పాత ఫొటోలను సేకరించి ఒక్కచోట చేర్చాడు.
 
                 
ఇందులో మహేశ్ బాబుతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్‌ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ధోనీ, హృతిక్ రోషన్, ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, టైగర్ ష్రాఫ్ ఉన్నారు. క్రికెటర్ ధోనీ కూడా గ్లోవ్స్‌ వెనుక తన ముఖం పెట్టుకుని ఉన్నారు. 'మాస్క్‌ ఇండియా' ట్యాగ్‌తో దీన్ని మహేశ్ తన ట్విట్టర్ ఖాతా‌లోనూ షేర్ చేశారు. అందరూ మాస్కు ధరించాలని ఆయన కోరారు.