Ramcharan: ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూత

upasana grand father passes away
  • తన తాత ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన
  • గొప్ప విలువలు, నిస్వార్థ వ్యక్తని ట్వీట్
  • ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారన్న ఉపాసన
తన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారని సినీనటుడు‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన తెలిపింది. ఈ మేరకు ఆమె తన తాత ఫొటోను పోస్ట్ చేస్తూ... ఆయన గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం ఉన్న వ్యక్తి అని తెలిపింది. తన తాతయ్యకు హాస్య చతురత కూడా ఎక్కువేనని ఆమె చెప్పింది. ఉర్దూ భాషలో ఆయన పలు రచనలు చేశారని తెలిపింది.

ఆయన టీటీడీ తొలి ఈవోగా పనిచేశారని, ఎన్నో మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది. 1928, జూన్‌ 15న పుట్టిన ఆయన  2020 మే 27న కన్నుమూశారని తెలిపింది.
Ramcharan
upasana
Tollywood

More Telugu News