Corona Virus: విశ్వాసమంటే ఇదే... కరోనాతో చనిపోయిన యజమాని కోసం మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే ఉన్న శునకం!

Dog Waits 3 Months at Hospital for his Owner who died with Covid
షార్ట్స్‌లో చూడండి
పెంపుడు జంతువులన్నింటిలో శునకాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఒకసారి తన యజమానిని అది నిర్ణయించుకున్న తరువాత, ఎంతో విశ్వాసాన్ని చూపుతుంది. ఈ విషయం ఎన్నోమార్లు రుజువైంది కూడా. అటువంటిదే మరో ఘటన చైనాలో కరోనా వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన వూహాన్ లో జరిగింది.

కరోనా వైరస్ తో తన యజమాని చనిపోయాడన్న విషయం తెలియని ఓ పెంపుడు కుక్క, మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ శునకానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ శునకం బాధను చూడలేకపోయిన వూహాన్ స్మాల్ ఏనిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ సిబ్బంది, దానికి మత్తిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల సమాహారాన్ని మీరూ చూడవచ్చు. 
Go Back to Shorts
Corona Virus
Dog
Wuhan

More Telugu News