ఆ పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గుతేల్చండి సీఎం గారూ!: నాగబాబు

26-05-2020 Tue 17:43
  • టీటీడీ ఆస్తులపై ఏపీ సర్కారు తాజా జీవో
  • థాంక్యూ సీఎం గారూ అంటూ స్పందించిన నాగబాబు
  • జగన్ కు అభినందనలు అంటూ ట్వీట్
Nagababu asks AP CM Jagan to enquire on Pink Diamond

టీటీడీ ఆస్తుల విక్రయం నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం గత రాత్రి జీవో జారీ చేసింది. దీనిపై మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్ కు అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్వైరీ చేసి నిజాలను నిగ్గుతేల్చండి అంటూ కోరారు. థాంక్యూ సీఎం గారూ అంటూ ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజు గులాబీ వజ్రాన్ని కానుకగా సమర్పించారని, అయితే ఆ వజ్రాన్ని దేశం దాటించారని అప్పట్లో రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే అంశాన్ని నాగబాబు ప్రస్తావించారు.