KTR: పోతిరెడ్డిపాడు తవ్వితే వైఎస్ కు హారతులు పట్టింది ఎవరు?: కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ కేటీఆర్

Telangana minister KTR slams Congress leaders over Pothireddypadu
  • కాళేశ్వరం నీళ్లు చూసి కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతోందన్న కేటీఆర్
  • కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు
  • రైతులకు కేసీఆర్ అన్యాయం చేయరని ఉద్ఘాటన
నీటి వాటాల అంశం రాజకీయ పక్షాల మధ్య కూడా ఆగ్రహ జ్వాలలు రగుల్చుతోంది. తాజాగా, కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నాడు వైఎస్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తవ్వకాలు చేపట్టినప్పుడు హారతులు పట్టింది ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎండాకాలంలో కూడా నీళ్లు వస్తుండడం చూసి కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నీళ్లు చూసి కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు దీక్షలు చేస్తామనడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల తీరు హంతకులే సంతాపం తెలిపినట్టుగా ఉందని పేర్కొన్నారు. రైతులకు కేసీఆర్ ఎప్పుడూ అన్యాయం చేయరని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR
Congress
Pothireddypadu
Kaleswaram
KCR
Telangana

More Telugu News