రాచనాగుకే స్నానం చేయించాడు.. వీడియో ఇదిగో!

26-05-2020 Tue 14:35
  • కేరళలో చోటు చేసుకున్న ఘటన
  • తన స్నానాన్ని ఎంజాయ్ చేసిన రాచనాగు
  • వీడియోను పోస్ట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా
King Cobra enjoys head bath

రాచనాగును చూస్తేనే భయంతో వణుకు పుడుతుంది. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా దానికి స్నానమే చేయించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పడగ విప్పిన రాచనాగు తలపై బకెట్ లోని నీటిని పోస్తుండగా... ఆ నాగు హాయిగా సేదతీరింది. కనీసం బుసలు కూడా కొట్టకుండా తల స్నానాన్ని ఎంజాయ్ చేసింది. 'సమ్మర్ టైమ్. తల స్నానాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు. అయితే ఎవరూ దీన్ని ప్రయత్నించవద్దు. చాలా ప్రమాదకరం' అని ఈ సందర్భంగా సుశాంత నందా ట్వీట్ చేశారు.