విజయసాయిరెడ్డి గారు.. మీ నాయకుడికి గుండెజారి గల్లంతయింది: వర్ల రామయ్య ఎద్దేవా

26-05-2020 Tue 10:36
  • మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు భయం
  • ఇక ప్రత్యక్ష సమావేశానికి రండి అని పిలుస్తున్నావు
  • మీకు గుండెలాగిపోవు?
  • హాస్యానికయినా హద్దుండాలి
varla ramaiah fires on ycp leaders

'విజయసాయిరెడ్డి గారు.. మీ నాయకుడు సీఎం జగన్‌కి గుండెజారి గల్లంతయింది' అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనలు అంటూ జూమ్ లో రోజూ ఊదరగొట్టారని,  ఏడాది పాలన పై జగన్ స్వయంగా నిర్వహిస్తున్న సదస్సుకు హాజరై ఆయన అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే.. రావట్లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలంటించారు. దీనికి కౌంటర్ ఇస్తూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

'విజయసాయిరెడ్డి గారు.. మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు, మీ నాయకునికి గుండెజారి గల్లంతయింది. ఇక, ప్రత్యక్ష సమావేశానికి రండి అని పిలుస్తున్నావు.. మీకు గుండెలాగిపోవు? హాస్యానికయినా హద్దుండాలి. కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక పోయిందట మీలాంటి వానికి. తస్మాత్ జాగ్రత్త' అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.