హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసిన బండి సంజయ్

25-05-2020 Mon 20:15
  • ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్న పవన్
  • పవన్ తో 50 నిమిషాల పాటు సమావేశమైన బండి సంజయ్
  • తెలంగాణలో కలిసి పనిచేసే అవకాశంపై చర్చ
Telangana BJP chief Bandi Sanjay met Pawan Kalyan in Hyderabad

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఏపీలో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతున్న పవన్ ను బండి సంజయ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణతో ముందుకు కదిలే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సుమారు 50 నిమిషాల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. బీజేపీ వర్గాలు మాత్రం ఈ భేటీని మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంగా అభివర్ణించాయి. దీనిపై బండి సంజయ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, తాజా పరిణామాలపై పవన్ ను కలిసి చర్చించానని మాత్రమే వెల్లడించారు.