RGV: కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం ఇలా..!: కొత్త చిత్రం నుంచి పిక్ రిలీజ్ చేసిన వర్మ

RGV releases a pic from his new movie Coronavirus
  • 'కరోనా వైరస్' పేరిట వర్మ కొత్త సినిమా
  • లాక్ డౌన్ కాలంలో తెరకెక్కించినట్టు వెల్లడి
  • రేపు సాయంత్రం ట్రైలర్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కరోనా వైరస్' పేరిట కొత్త చిత్రం తీసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కాలంలోనే తెరకెక్కించానని వెల్లడించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పిక్ ను షేర్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం ఇలా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఆ పిక్ లో దంపతులు బెడ్రూంలో కూడా మాస్కులు ధరించి ఎంతో ఎడంగా కూర్చుని ఉండడం చూడొచ్చు. మొత్తమ్మీద వర్మ సినిమా తీయడమే కాదు ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు. రేపు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
RGV
Corona Virus
Movie
Pic
KCR
Physical Distance

More Telugu News