ఓటీటీ ద్వారా కీర్తి సురేశ్ సినిమాల విడుదల!

25-05-2020 Mon 15:46
  • థియేటర్లకు లాక్ డౌన్ ఎఫెక్ట్ 
  • చిన్న చిత్రాలకు ఆశాదీపంలా ఓటీటీ 
  • కీర్తి సురేశ్ తమిళ చిత్రం 'పెంగ్విన్'
  • 'మిస్ ఇండియా' విషయంలో చర్చలు   
Keerthi Suresh films to be released through OTT

లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడం వల్ల కొన్ని సినిమాల నిర్మాణం పూర్తయినప్పటికీ, విడుదల కాకుండా ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అయితే, ఈ సమయంలో కొందరు నిర్మాతలను ఓటీటీ ప్లేయర్లు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న బడ్జెట్టులో నిర్మించిన చిత్రాల నిర్మాతలకు ఇవి ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. థియేటర్ల కోసం వేచి చూడకుండా మంచి రేటు చూసుకుని, డిజిటల్ రిలీజ్ కి వెళ్లిపోతున్నారు.

ఈ క్రమంలో అందాల కథానాయిక కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్' తమిళ చిత్రం ఇప్పటికే ఓటీటీ ద్వారా విడుదల కావడానికి ఒప్పందం జరిగిపోయింది. ప్రైమ్ వీడియో ద్వారా ఇది జూన్ 19న విడుదల కానుంది. ఇక ఆమె నటించిన తెలుగు చిత్రం 'మిస్ ఇండియా' నిర్మాత కూడా డిజిటల్ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మించారు. ప్రస్తుతం కొందరు ఓటీటీ ప్లేయర్స్ తో సంప్రదింపులు జరుగుతున్నాయట. మంచి రేటు వస్తే ఇచ్చేస్తారని సమాచారం.