ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు, లోకేశ్

25-05-2020 Mon 15:17
  • రెండు నెలల విరామం తర్వాత తిరిగి రాక
  • మార్చి 22 నుంచి హైదరాబాదులోనే ఉన్న చంద్రబాబు
  • ఉండవల్లిలో చంద్రబాబుకు ఘనస్వాగతం
Chandrababu and Lokesh arrived Undavalli

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు నెలల అనంతరం తిరిగి ఏపీలో అడుగుపెట్టారు. మార్చి 22 నుంచి హైదరాబాదులోనే ఉన్న ఆయన లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఉండవల్లి వచ్చారు.

వాస్తవానికి ఈ ఉదయం విశాఖ వెళ్లాల్సిన చంద్రబాబు, విమానం రద్దవడంతో రోడ్డు మార్గంలో అమరావతి పయనమయ్యారు. ఆయనకు ఏపీలోని పలు ప్రాంతాల్లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. కరకట్టపై నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు అభివాదం చేశారు.