అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దు: హైకోర్టు కీలక ఆదేశాలు

24-05-2020 Sun 20:09
  • ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తో 12 మంది మృతి
  • సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
  • ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశం
High Court issues key orders in LG Polymers incident

వైజాగ్ లో 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా విచారణ షురూ చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ విచారణ జరిపిన అనంతరం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. సంస్థ డైరెక్టర్లు తమ పాస్ పోర్టులను అప్పగించాలని పేర్కొంది. అంతేకాదు, విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించవద్దని, ప్రాంగణాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది.