సీఎం జగన్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

24-05-2020 Sun 15:12
  • షూటింగులకు సింగిల్ విండో అనుమతులపై చిరంజీవి స్పందన
  • జీవో ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు
  • త్వరలోనే టాలీవుడ్ ప్రతినిధులతో వెళ్లి సీఎంను కలుస్తామని వెల్లడి
Chiranjeevi thanked YS Jagan for single window system

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోవడంతో పాటు వేలాది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, అగ్రనటుడు చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు.

ఏపీ సీఎం జగన్ చిత్ర పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేశారని చిరంజీవి వెల్లడించారు. అందుకే సీఎం జగన్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేశానని వివరించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత టాలీవుడ్ సమస్యలపై చర్చిద్దామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చిరంజీవి వెల్లడించారు. త్వరలోనే టాలీవుడ్ లోని అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో వెళ్లి ఏపీ సీఎంను కలుస్తామని తెలిపారు. ఈ పరిస్థితిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టాలీవుడ్ ప్రతినిధుల బృందం కలిసిన సంగతి తెలిసిందే.