డాక్టర్ సుధాకర్ వ్యవహారం మేనేజ్ చేయడానికి నేను రంగంలోకి దిగానట!: మంత్రి ఆదిమూలపు

24-05-2020 Sun 13:49
  • ఏపీలో తీవ్ర కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం
  • తాను డాక్టర్ సుధాకర్ కుటుంబీకులతో మాట్లాడలేదన్న మంత్రి ఆదిమూలపు
  • మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ సవాల్
Adimulapu Suresh denies allegations that he was talk to Dr Sudhakar and his mother

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో మేనేజ్ చేయడానికి నేను రంగంలోకి దిగినట్టు టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు.

నేను డాక్టర్ సుధాకర్ తో గానీ, వాళ్ల అమ్మతో గానీ మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. నిరూపించడానికి మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.  అయినా, మేనేజ్ చేయడం అనే మాటను మీరు తరచుగా వాడడం చూస్తుంటే మీకు, మీ పార్టీకే మేనేజ్ చేసే అలవాటు ఉందన్న విషయం తెలిసిపోతోందని మంత్రి ఆదిమూలపు విమర్శించారు. టీడీపీ, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్లను ఉపయోగించుకుని దళితులను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆరోపించారు.